సత్యం,ధర్మం,అహింస అన్న ఆయుధాలతో తెల్ల దొరల నుండి భారతదేశానికి విముక్తి కల్పించి దేశ ప్రజలకు స్వాతంత్రాన్ని అందించిన మహాత్మా గాంధీజీ చూపిన బాటలో నడుద్దాం అని చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం గాంధీజీ జయంతి సందర్భంగా దుబ్బాక మున్సిపల్ కేంద్రంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట కాంగ్రెస్ దుబ్బాక మున్సిపల్, మండల అధ్యక్షులు నర్మెట యేసు రెడ్డి,కొంగర రవి,జిల్లా నాయకులు అనంతుల శ్రీనివాస్, పలువురు నాయకులు, కార్యకర్తలున్నారు.