ప్రభుత్వ ఆస్పత్రులకు మెరుగైన వసతులు కల్పించాలి: చెరుకు శ్రీనివాస్ రెడ్డి

నవతెలంగాణ – తొగుట 
నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రులు మెరు గైన వసతులు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ దామోదర్ రాజా నరసింహ ను మర్యాదపూర్వకంగా కలిసారు.  దుబ్బాక నియో జకవర్గం లోని పలు ప్రభుత్వ ఆసుపత్రులు పిహె చ్సి, హెల్త్ సెంటర్లలో కావలసిన సిబ్బందిని ఏర్పా టు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి స్పందిస్తూ మెరుగైన వైద్యాన్ని అందించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చెరుకు విజయ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్, దుబ్బాక మండల పిఎసిఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గడ్డం శ్రీనివాస్ గౌడ్, వెంకటాచారి, కుమ్మరి కిషన్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.