చెరుకు శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలుపిం చాలి..

నవతెలంగాణ- తొగుట: చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలుపించాలని మాజీమంత్రి చెరుకు ముత్యం రెడ్డి సతీమణి విజయమ్మ, ఎంపీపీ గాంధారి లతా నరేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ఎల్లారెడ్డిపేట, పెద్ద మసాన్ పల్లి గ్రామాలలో మాజీ ఎంపీపీ గంటా రేణుక రవీందర్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల సంద ర్భంగా వారు మాట్లాడుతూ మాజీమంత్రి ముత్యం రెడ్డి తనయుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తారని తెలిపారు. నియోజకవర్గంలో ఘతం ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి పథకాలు ఉన్నాయి, కానీ నేటి వరకు దుబ్బాక లో ఎలాంటి అభివృద్ధి కాలేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీని ఆదరించి చెరుకు శ్రీనివాస్ రెడ్డి కి ఓటు వేసి బారి మెజారిటీతో గెలుపించాలని కోరారు. ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ నాయకులు నర్సింలు, ఆయా గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.