నవతెలంగాణ – మిరు దొడ్డి
శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువలను అపహస్యం చేసే విధంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యవహరించారని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారన్నారు. ఎన్నికల్లో గెలుపొందడానికి ఆయన ప్రవర్తించిన తీరు రాజకీయ వ్యభిచారిగా ఉందని అభివర్ణించారు. రానున్న లోక సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కార్యకర్త లు సైనికుల కృషి చేయాలన్నారు. నామినేట్ పదవుల కోసం దిగజారుడు రాజకీయాలు చేయవద్దన్నారు. పార్టీ బలోపేతం కు కృషి చేసే ప్రతి కార్యకర్తకు సముచిత ప్రాధాన్యం కలుగుతుందన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన యువకులు పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజేశం, మండల మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి, నాయకులు భూమా గౌడ్, రాజు ,భూపాల్ గౌడ్ , హర్షద్, వెంకటస్వామి గౌడ్, నరేందర్ రెడ్డి, జోగ్యారి భాస్కర్, కుట్టల్, మహేష్ ,జాంగిర్ ,సుదర్శన్, కనకా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.