ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులుగా చెరుకుపల్లి సతీష్..

నవతెలంగాణ -చివ్వేంల : ఎమ్మార్పీఎస్ చివ్వేంల మండల అధ్యక్షుడిగా దురాజ్ పల్లి గ్రామానికి చెందిన  చెరుకుపల్లి  సతీష్ ను  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శని వారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రావు భవనంలో  జిల్లా ఇంచార్జి తురుగంటి అంజయ్య  , కో ఇన్చార్జి ములకలపల్లి రవి  ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ జిల్లా సమావేశంలో  ఏకగ్రీవంగా చెరుకుపల్లి సతీష్ ను  ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు గుద్దటి ఎల్లన్న, జాతీయ సమన్వయకర్త చింతలపాటి చిన్న శ్రీరాములు, పట్టణ సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి  పుట్టల మల్లేష్, జిల్లా కార్యదర్శి బొడ్డు విజయ్ కుమార్,  ఎం ఎస్ పి పార్టీ ఇన్చార్జి దైద వెంకన్న,  పట్టణ అధ్యక్షులు  బొజ్జ వెంకన్న, ఆత్మకూరు (ఎస్) మండల అధ్యక్షులు మేడి కృష్ణ , జిల్లా కార్యదర్శి కొండేటి గోపి,  జిల్లా ప్రచార కార్యదర్శి మొలుగురి రాజు, ఆత్మకూరు మండల అధికార ప్రతినిధి మిర్యాల చిన్ని , మొండి కత్తి జానకి రాములు, వలపట్ల జానయ్య  తదితరులు పాల్గొన్నారు.