యూనివర్సిటీ లో చదరంగ పోటీలు ప్రారంభం..

నవతెలంగాణ- డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీలో అంతర్ కళాశాల చదరంగ పోటీలను తెలంగాణ వర్సిటీ క్రీడా విభాగం డైరెక్టర్ డాక్టర్ జి. బాలకిషన్ బుధవారం  ప్రారంభించారు. డైరెక్టర్ డా. జి. బాలకిషన్  మాట్లాడుతూ ఈ చదరంగ పోటీలకు ఉమ్మడి నిజామాబాద్  జిల్లా నుండి ఆరు కళాశాలల నుండి 30 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను సౌత్ జోన్ అంతర వర్సిటీ పోటీలకు పంపనున్నట్లు అయన వివరించారు. ఈ సౌత్ జోన్ ఇంటర్ వర్సిటీ చెస్ చాంపియన్స్ -2024 ను తమిళనాడులోని భారతి దాసన్ యూనివర్సిటీ చెన్నైలో ఈనెల 24 నుండి 29 వరకు నిర్వహిస్తారు.  తెలంగాణ యూనివర్సిటీ నుండి ఎం సందీప్ ఎం ఏ( ఏపిఈ) ,బి రాకేష్ ఎంఏ   తెలుగు), ఏ హనుమాన్ గుప్తా (నిషిత డిగ్రీ కళాశాల) ,ఎన్ సాయికుమార్ ఎంఏ (హిందీ),
కే శివ సాయి  ఎం ఏ( ఏ పి ఈ ) లు పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ చదరంగ క్రీడలకు  తెలంగాణ యూనివర్సిటీ  క్రీడా విభాగం సహా ఆచార్యులు (కాంటాక్ట్) డాక్టర్ బి.ఆర్ నేత కన్వీనర్ గా వ్యవహరిస్తారని డైరెక్టర్  డా. జి.బాలకిషన్ తెలిపారు.