– సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి దీపాదాస్ మునీ సమక్షంలో సొంత గూటికి చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే
నవతెలంగాణ-చేవెళ్ల
బీఆర్‌ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య బీఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. ఇవాళ ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యా లయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ తెలం గాణ ఇన్‌చార్జి దీపాదాస్ మునీ సమక్షంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చు కున్నారు. దీంతో ఇప్పటి వరకు కారు పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరు కుంది. ఇంతకుముందు భద్రాచలం-తెల్లం వెంక ట్రావు, ఖైరతాబాద్-దానం నాగేందర్, స్టేషన్ ఘన పూర్-ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బాన్సువాడ-పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల-ఎమ్మెల్యే డా. సంజరు హస్తం పార్టీలో చేరగా తాజాగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కూడా వారి బాటలోనే వెళ్లారు. ఢిల్లీలో సీఎం రేవంత్, దీపాదాసు ముని సమక్షంలో చేరారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేల సంఖ్య ఆరుగురు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో 2014 లో బీఆర్‌ఎస్ ఊపు రాష్ట్రం మొత్తం ఉన్నప్పటికీ చేవెళ్ల నియోజకవర్గంలో స్వల్ప ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. తదనంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. తర్వాత మరోసారి బీఆర్‌ఎస్ పార్టీ తరఫున గెలు పొదారు. అదేవిధంగా 2023 ఎన్నికల్లో 262 ఓట్ల అతి స్వల్ప ఓట్ల మెజార్టీతో గెలు పొందారు. మరల కాంగ్రెస్ పార్టీకి చేరడంతో చేవెళ్ల నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. తక్కువ మెజార్టీ వస్తేనే తను పార్టీ మారతాడని అనుకోవడంలో సందేహం లేదని పలువురు చర్చించుకుంటున్నారు.
కేసీఆర్‌కు సన్నితుడిగా చేవెళ్ల ఎమ్మెల్యే
చేవెళ్ల నియోజకవర్గంలో గెలుపొందినప్పటి నుంచి బీఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న తర్వాత బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసిఆర్‌కు వారి కుటుంబానికి అతి దగ్గరగా ఉన్న వ్యక్తుల్లో కాలె యాదయ్య ఒక్కరని చెప్పుకోవచ్చు. 2023 లో బీఆర ్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే మంత్రి పదవి రేసులో దళిత, బడుగు, బలహీన వర్గాల కూటలో మంత్రి పదవి వచ్చేదనీ అనుకున్న వారికి తీరా నిరాశే మిగలింది.
వలసల నివారణలో ఫలించని కేసీఆర్ ప్రయత్నాలు
ఒకరి తర్వాత ఒకరు ఎమ్మెల్యేలంతా పార్టీ మారుతుంటే వారిని నిలు వరించడంలో గులాబీ నేత విఫలం అవుతున్నారు. వలసల నేపథ్యంలో కొన్నిరోజులుగా ఫాం హౌస్ కేంద్రంగా ఆయన వ్యూహరచన చేస్తున్నారనే టాక్ వినిపించింది. ఈ క్రమంలోనే దశలవారీగా ఎమ్మెల్యేలతో భేటీ అయి ఎవరూ తొందరపడవద్దని సూచించినట్టు వార్తలు వచ్చాయి. అయినా కేసీఆర్ మాటలను ఖాతరు చేయని ఎమ్మెల్యేలు తమ దారి తాము వెతుక్కుం టున్నారు. వలసల విషయంలో రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న సీక్రెట్ స్ట్రాటజీని కేసీఆర్ అంచనా వేయలేకపోతున్నారనే చర్చ తెరపైకి వస్తోంది. కాంగ్రెస్‌తో చాలామంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నా రనే ఊహాగానాలు వినిపిస్తున్నా వారిని గుర్తించి నిలువరించడంలో కేసీఆర్ ఫెయిల్ అవుతున్నారన్న చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇంకెంత మంది ఎమ్మెల్యేలు జంప్ అవుతారనేది ఆసక్తిగా మారింది.