ప్రత్యర్థులు ఒకటయ్యారు ఇరువర్గాలను కలిపే పనిలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి

– అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా నాయకుల పనితీరు ఉండాలని దిశా నిర్దేశం
– ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి,
– మంత్రి మహేందర్‌ రెడ్డి వర్గీయులకు సమానంగా పదవులు ఉండాలని ఒప్పందం
 -ఈనెల 31న తాండూరులో మహేందర్‌ రెడ్డి, రోహిత్‌ రెడ్డి సంయుక్తంగా ర్యాలీ
నవతెలంగాణ-తాండూరు
తాండూరు అసెంబ్లీలో రసవత్తర రాజకీయా లు కొనసాగుతున్నాయి. తాండూరు నియోజకవర్గ రాజకీయాల్లో ఎప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునే మంత్రి మహేందర్‌ రెడ్డి ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డిలు అధిష్టానం ఆదేశాలతో ఇద్దరు ఒకట య్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉ న్న ఇద్దరు నేడు కలిసిపోయారు. తాండూరు నియో జకవర్గంలో బీఆర్‌ఎస్‌ జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇద్దరు నాయకులను కలిపేందుకు చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి ఇరు వర్గాల నాయకులతో మాట్లాడి నచ్చ చెబుతున్నారు. ప్రత్యేక సమావేశాలతో అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఏ పదవులు వచ్చినా ఇరు వర్గాలకు సమానంగా ఉండే విధంగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. రాను న్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎమ్మెల్సీ, మంత్రి, మహేందర్‌ రెడ్డి ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డిలతోపాటు వారి సెకండ్‌ క్యాడర్‌తో కూడా ఎంపీ రంజిత్‌ రెడ్డి ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ ఒకటి చేస్తున్నారు. ఇరువర్గ నాయకులు కార్యకర్త లూ ఒక్కటయ్యారు. నాయకులను కార్యకర్తలను ఏకతాటికి తీసుకోచ్చి ఎంపీ రంజిత్‌ రెడ్డి మధ్యవ ర్తిగా ఉండి ఒకటి చేశారు. రెండు రోజులుగా హైద రాబాద్‌ శివారులోని ఎంపీ రంజిత్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌ నందు ఎమ్మెల్సీ మంత్రి మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్‌ వర్గీయుల అనుచరులతో ఎంపీ రంజిత్‌ రెడ్డి మధ్యవర్తిగా ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి సమక్షంలో భేటీ అయ్యారు. రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ అధిష్టానం మేరకు ఒక్కటిగా ఉండి చేయవలసిన కార్యక్రమాల గురించి చర్చించినట్లు సమాచారం. పార్టీలో వర్గాల మధ్య సయోధ్య కుదిరే విధంగా పదవుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ప్రత్యర్థులు గా ఉన్న సమయంలో పెట్టుకున్న వివిధ కేసులు, నామినేట్‌ పదవులు, లబ్దిదారుల ఎంపికపై చర్చిం చినట్లు తెలుస్తుంది. ప్రతి మండలంలో ఇద్దరి నాయకులకు సంబంధించిన వారికి పదవులు దక్కే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న లబ్దిదారుల ఎంపికల్లో లబ్దిదారులు కూడా సమానంగా ఉండేలా చూసుకోవాలని ఒప్పం దం కుదుర్చుకుంటున్నారు. తాండూరు నియోజక వర్గం రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉన్న ఇద్దరు నా యకులు కలిసి తాండూరు పట్టణంలో భారీ ర్యాలీ తో పాటు సభను నిర్వహించేందుకు సన్నహాలు చే స్తున్నట్లు తెలుస్తోంది. తాండూరులో ఇద్దరు నా యకులు కలిసి పోవడంతో సెకండ్‌ క్యాడర్‌ నాయకులు కూడా కలిసి పోతారా లేదా వేచి చూడాలి.