
ప్రతి పౌరుడు శివాజీ జీవన విధానాన్ని అలవర్చు కోవాలని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దోమల కొమురయ్య అన్నారు. సోమవారం మండలం లోని కాన్గల్ గ్రామంలో శివాజీ యూత్ ఆధ్వర్యం లో చత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకల్లో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దోమల కొమురయ్య పాల్గొ న్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు శివాజీ జీవన విధానాన్ని అలవర్చుకోవా లని, శివాజీ లాగా పట్టువిడని విక్రమార్కుడులా సమస్యను పరిష్కరించుకునే విదంగా కృషి చేయా లన్నారు. కార్యక్రమాన్ని నిర్వహించిన శివాజీ యూ త్ సభ్యులను అభినందించుతూ గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు ఛత్రపతి శివాజీ జయంతి శుభా కాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాదారం ప్రశాంత్, లింగుపల్లి బాలరాజ్, పోతురాజు యాద గిరి, కాముని స్వామి, తరిగొప్పుల స్వామి, శివాజీ, సభ్యులు, చరణ్, మనోజ్, నర్సింలు, సాయి, రామ్, వంశీ, రంజిత్, గౌతం, నవీన్, శ్రీనాథ్ ,యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.