
గాంధారి మండల కేంద్రంలో మండలంలోని వివిధ గ్రామంలో తండాల్లో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాతీయ బీసీ సంఘం కార్యదర్శి బండి రాజు మాట్లాడుతూ.. చత్రపతి మహారాజ్ ధైర్యానికి దేశభక్తికి దైవభక్తులకి మారుపేరుని శివాజీ మహారాజు స్ఫూర్తి మనందరినీ ధైర్యము చిత్తశుద్ధి, ధర్మం వైపు నడిపిస్తుందని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల బీసీ నాయకులు మండల ఉపాధ్యక్షులు తాటిపాముల సత్యం, మండల యూత్ ప్రధాన కార్యదర్శిపనికంటి నవీన్, మండల యూత్ అధ్యక్షుడు సిందే నితిన్ , బీసీ నాయకులు శ్రీకాంత్ మహేందర్ యాదవ్ సురేష్ మహదేవ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.