ధైర్యానికి, పోరాటానికి మారుపేరు ఛత్రపతి శివాజీ మహారాజ్

– బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
– ఉప్లూర్ లో చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ
 నవతెలంగాణ – కమ్మర్ పల్లి
ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఓ ధైర్యానికి, పోరాటానికి, వీరత్వానికి మారుపేరు అని రాష్ట్ర మాజీ మంత్రి, బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మండలంలోని ఉప్లూర్ గ్రామంలో విగ్రహ దాత వేముల ప్రశాంత్ రెడ్డి అందించిన ఆర్థిక సహాయంతో  అవారి పటేల్ సంఘం సభ్యులు, గ్రామ యువకుల ఆధ్వర్యంలో  చత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా విగ్రహాన్ని ఆవిష్కరించి, పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి  మాట్లాడుతూ… చత్రపతి శివాజీ అంటే ఉదయానికి పోరాటానికి వీరత్వానికి మారుపేరు అన్నారు.ఆ రోజుల్లో మొఘాలులు  భారతదేశాన్ని ఆక్రమించుకుంటూ, తమ సామ్రాజ విస్తరణ చేస్తున్న సమయంలో మొదటి హిందూ రాజుగా వారి సామ్రాజ విస్తరణ అడ్డుకొని వారితో విరోచితంగా పోరాడి యుద్ధం చేసిన వ్యక్తి చత్రపతి శివాజీ మహారాజ్ అన్నారు. చత్రపతి శివాజీ మహారాజ్ 50 సంవత్సరాలు జీవిస్తే 27 సంవత్సరాలు మొగల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధాలు చేసి 300 కోటలు జయించిన మహావీరుడు అని కొనియాడారు.చత్రపతి శివాజీ మహారాజు వీరత్వానికి స్ఫూర్తిగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. మొత్తం భారతదేశంలో మొగల్ సామ్రాజ విస్తరణను అడ్డుకున్న మొట్టమొదటి రాజుగా చత్రపతి శివాజీ మహారాజ్ అయినందున భారతదేశంలోని అందరి రాజులు శివాజీ మహారాజ్ కు చత్రపతి అని బిరుదుని ఇచ్చారన్నారు. చత్రపతి అంటే నాయకుడని మేము చేయలేకపోయిన మొగల్ సామ్రాజ విస్తరణను మీరు అడ్డుకున్నందుకు మీరు చత్రపతి అని బిరుదుని ఇచ్చారన్నారు. చత్రపతి శివాజీ మంచి లౌకిక పాలకుడని, ప్రజలందరినీ సమానంగా చూసిన గొప్ప వ్యక్తి అన్నారు. మొగల్  రాజ్యాన్ని వ్యతిరేకించాడు తప్ప, ప్రజల్లో తారతమ్యాలను చూడలేదన్నారు. భారతదేశంలో ప్రజలు ఎక్కడున్నా తమ ప్రజలే అని భావించి పాలన చేసిన గొప్ప వ్యక్తి చత్రపతి శివాజీ అన్నారు. అఖండ హిందూ సామ్రాజ స్థాపనకు పూనుకోవాలని, భారత దేశంలోని మొగల్ సామ్రాజ్య విస్తరణకు వ్యతిరేకంగా మిగతా రాజులకు పిలుపునిచ్చిన యోధుడు, ధీరుడు కాబట్టే ఈరోజు చత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశంలో అన్ని పల్లెల్లో, గ్రామాల్లో యువకులకు ఆదర్శంగా నిలిచాడు అన్నారు. అనంతరం గ్రామంలో చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ పురస్కరించుకొని గ్రామస్తులకు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యుడు అనిల్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్, రాష్ట్ర నాయకులు బద్దం చిన్నారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు వారి మురళి, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బద్దం రమేష్ రెడ్డి, నాయకులు అవారి గంగారెడ్డి, వారి పటేల్ సంఘం సభ్యులు, గ్రామ యువకులు, తదితరులు పాల్గొన్నారు.