– జయంతి ఉత్సవాల్లో ఎంపీటీసీ సభ్యులు మందాకిని శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ – మద్నూర్
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని మద్నూర్ మండలంలోని మేనూరు గ్రామంలో ఆ గ్రామ ఎంపీటీసీ మందాకిని శ్రీనివాస్ గౌడ్ శివాజీ చిత్రపటానికి నివాళులర్పించి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప మహనీయుడని పేర్కొన్నారు.ఆయన చేసిన సేవలు మరువ లేనివాని గుర్తు చేశారు. ఈ జయంతి వేడుకల్లో మేనూరు గ్రామస్తులు పాల్గొన్నారు.