– కింగ్స్ కప్స్ సెమీస్‌లో ఇరాక్ చేతిలో ఓటమి
చింగ్‌మై(థారులాండ్): కింగ్స్‌కప్-2023 సెమీస్‌లో ఛెత్రీ సేనకు నిరాశ తప్పలేదు. ఈ ఏడాది హ్యాట్రిక్ ట్రోఫీలతో జోరుమీదున్న భారత ఫుట్‌బాల్ జట్టుకు కింగ్స్ కప్‌లో షాక్ తగిలింది. గురువారం జరిగిన సెమీస్‌లో భారతజట్టు పెనాల్టీ షూటౌట్‌లో ఇరాక్ చేతిలో ఓటమిపాలైంది. థారులాండ్ స్టేడియం 700వ వార్షికోత్సవాల్లో భాగంగా ఈ పోటీలు జరుగుతున్నాయి. ఆట కీలక దశలో ఇరాక్ ఆటగాడు జిందాన్ ఇక్బాల్ రెడ్ కార్డ్ కారణంగా మైదానం వీడాడు. దాంతో ఆ జట్టు పది మంది ఆటగాళ్లతోనే మిగతా మ్యాచ్‌ను పూర్తిచేసింది. నిర్ణీత సమయం పూర్తయ్యే సరికి ఇరుజట్లు 2-2గోల్స్‌తో సమంగా నిలిచాయి. అనంతరం పెనాల్టీ షూటౌట్‌లో 5-4గోల్స్ తేడాతో ఇరాక్ చేతిలో ఓటమిపాలైంది. పెనాల్టీ తొలి గోల్‌ను కొడ్డంలో భారత స్ట్రయికర్ బ్రాండన్ విఫలమయ్యాడు. ఇరాక్ ఐదు గోల్స్ చేయగా.. భారత్ నాలుగు గోల్స్ మాత్రమే చేసింది. దీంతో సొంత గడ్డపై జరిగిన ముక్కోణపు టోర్నెమెంట్, ఇంటర్ కాంటినెంటల్ కప్, శాఫ్ చాంపియన్‌షిప్స్‌లో విజేతగా నిలిచింది. కెప్టెన్ సునీల్ ఛెత్రీ అద్భుత ప్రదర్శనకు తోడూ యువ ఆటగాళ్లు రాణించడంతో ఈ ఏడాది భారత జట్టు వరుస విజయాలు సాధించింది. అంతేకాదు ఫిఫా ర్యాంకింగ్స్‌లో 100లోపు నిలిచింది. ఈ సీజన్‌లో టీమిండియా ఫైనల్ చేరకపోవడం ఇదే మొదటిసారి. రెండో సెమీస్ లెబనాన్-థారులాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.