
– రెండు పక్కల పార్కులు మధ్యలో మురుగు..
– ప్రతిపాదనలు, మంజూరు కానీ నిధులు..
నవతెలంగాణ – వేములవాడ
పెద్ద వాగులో గతంలో పేద భక్తులు సేద తీరడానికి భక్తులకు తడకలతో చల్వపందిల్లు దేవస్థానం వారు ఏర్పాటు చేసేవారు. వాగులో దేవస్థానం బావి.. భక్తుల కోసం మంచి నీటి నల్లాలు ఉండేవి. రాజన్న దర్శించుకోవడానికి వచ్చే భక్తులు వాగు బ్రిడ్జి కింద వంటావార్పు చేసుకుని ఉండేవారు.. జీవకళ ఉట్టిపడే వాగు నేడు మురికి కుంపంగా చెత్తాచెదారం, చికెన్ వ్యర్ధాలు, పిచ్చి మొక్కలు, ముళ్ళ పొదల తో వాగు పూర్తిగా అధ్వానంగా మారింది.. కొత్తగా రాజన్న సిరిసిల్ల జిల్లా అయ్యాక చిన్న జిల్లా పెద్దా అభివృద్ధి జరుగుతుందని పట్టణ ప్రజలు అనుకున్నారు.. జిల్లాకి రెండు నియోజకవర్గాలు సిరిసిల్ల, వేములవాడ.. గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కేటీఆర్ పురపాలక, ఐటి శాఖ మంత్రిగా, సిరిసిల్ల ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని ఉరుకుల పరుగులతో అభివృద్ధి పరుగులు పెట్టించారు.. వేములవాడ మాత్రం అభివృద్ధికి ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్నట్లు ఉంది.. దానికి నిదర్శనం బస్సులో వచ్చే, వివిధ వాహనాల వచ్చే భక్తులు మొదటగా కనిపించేది, వేములవాడ పెద్ద వాగు దానిని చూడగానే మొట్టమొదటిగా అనిపించేది,చి.. ఛీ కంపు కొడుతుంది..! పాలకుల ,అధికారుల నూకదంపుడు ఉపన్యాసాల ఉంది వేములవాడ అభివృద్ధి.. వేములవాడ పట్టణంలోని, తిప్పాపూర్ మురుగునీరు అంత పెద్ద వాగులో చేరడంతో తన జీవకళ కోల్పోతుంది.
మూసి నదిని తలపిస్తున్న పెద్దవాగు:
వాగు కు రెండు వైపులా ఆహ్లాదం కలిగించే విధంగా లక్షల రూపాయలు ఖర్చు చేసి రెండు పార్కులను ఏర్పాటు చేశారు. మధ్యలో వాగు సుభాష్ నగర్, ఉప్పుగడ్డ పై వార్డుల నుండి రెండోవైపు తిప్పాపూర్ లోని మురికి కాల్వల ద్వారా మురికి నీరు వచ్చి వాగులో చేరుతోంది, మొదటి బైపాస్ రోడ్ లో కూరగాయలు విక్రయాలు, చెడిపోయిన కూరగాయలు, పట్టణంలోని చికెన్ సెంటర్ లోని చికెన్ వ్యర్ధాలు తీసుకువచ్చి వాగులో పడేస్తున్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న రాజన్న క్షేత్రం వాగులో శివుడు తలపై ఉండే గంగ మూల వాగులో ఉండే గంగమ్మ గుడి చుట్టుపక్కల కుళ్ళిపోయిన కూరగాయలు, పట్టణంలోని, తిప్పాపూర్, బతుకమ్మ తిప్ప వద్ద ఉన్న ధోబి ఘాట్ లోని నీళ్లు వచ్చే మురుగునీరు అంతా అక్కడే వచ్చి చేరడంతో వాగు అంతా కలుషితం అవుతుంది. చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు, ఇంపుగా పెరిగిన ముళ్ళపోదలు వాగు జీవకళ కోల్పోయి, అందవిహీనంగా కనిపిస్తుంది. మొదటి బైపాస్ రోడ్, తిప్పాపూర్ బస్టాండ్ వెనకాల రాజన్న సన్నిధికి వచ్చే భక్తులకు, పట్టణ ప్రజలకు భక్తిభావంతో ఆధ్యాత్మికంగా ఉట్టిపడేలా వాగకు రెండు వైపులా వాగు ఒడ్డును రీలింగ్ చేసి ఇరువైపులా బాండ్ నిర్మించి సుమారుగా రెండు కోట్ల పైనే వెచ్చించి గ్రీనరీ, రంగురంగుల పూల మొక్కలు, వాటర్ ఫౌంటెంట్లు, కల్లు జిగేల్మనేలా విధంగా విద్యుత్ దీపాలు పార్కు వచ్చే వారికి ఆనందం, ఆహ్లాదం సేద తీరడానికి బల్లలు, వాకర్స్ నడవడానికి సిసి రోడ్డు వివిధ హంగులతో నిర్మించారు. పెద్ద వాగు అంత మురికి నీరుతో పిచ్చి మొక్కలు, ముళ్ళపదలతో చికెన్ వ్యర్థాలతో దుర్గంధం వెదజల్లుతూ కంపు కొడుతుంది.
ప్రతిపాదనలు, మంజూరు కానీ నిధులు:
వాగులో వచ్చి చేరే మురుగు నీరు అంతా డ్రైనేజ్ పైప్ లైన్ ద్వారా సంకేపల్లి వద్ద రీసైకిలింగ్ చేయడం కోసం మూడు కోట్ల రూపాయల వ్యయంతో మున్సిపల్ అధికారులు గత ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ప్రతిపాదనలు పంపారు. నేటికీ అ నిధులు మంజూరు కాలేదు. వాగులో మురికి నీరు , వ్యర్ధాలు, చిత్తా చెదారం సమస్య అలాగే ఉంది వాగులోని వ్యర్థాలను తొలగించి శుభ్రపరచాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా నిధులు మంజూరయ్యే విధంగా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శ్రద్ధ వహించి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.