నవతెలంగాణ – డిచ్ పల్లి
గత ఐదు నెలల నుండి బిల్లులు రాక మధ్యాహ్న భోజన కార్మికులు చాలా ఇబ్బంది ఎదురుకుంటున్నారని, గత ఐదు నెలల నుంచి తెచ్చి పెట్టిన డబ్బులకి దుకాణం దారులు అప్పిచ్చి ఉద్దేర ఇవ్వడానికి నిరాకరిస్తూన్నరని, ఉన్న వస్తువుల్ని తాకట్టు పెట్టడం జరుగుతుందని ప్రభుత్వం వేంటనే నిత్యవసర వస్తువులన్నీ ప్రభుత్వమే సప్లై చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం డిచ్ పల్లి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో వినతిపత్రాన్ని ఎండీఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు తోపునూరు చక్రపాణి అద్వర్యంలో అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంట చేసేముందు కచ్చితంగా కోడిగుడ్లు పెట్టాలి, రాగి జావ పెట్టాలని చెప్పడం సరి కాదన్నారు. ప్రభుత్వం తీరు మార్చు కొవలని, రాగి జావా, కోడిగుడ్లు పెట్టక పోవడానికి కారణం కార్మికులే అని చెపుతుడటం సరైంయింది కాదన్నారు. ప్రభుత్వం కోడిగుడ్లు, నిత్యావసర వస్తువులు, గ్యాస్ తో సహా ఇస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉంటామన్నారు. గతేడాది ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా రూ.10000 రూపాయలు వేతనం ఇవ్వాలని, ఈ ఎస్ ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, కార్మికులు గా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాట్లు వివరించారు. కోడిగుడ్డు కు ప్రభుత్వం నుంచి మాకు ఐదు రూపాయలే వస్తున్నాయని, రాగి జావా కు సత్యసాయి సమితి కి 1:25 పైసలు ప్రభుత్వం ప్రతినెల ఇస్తున్నదని, రాగి జావా చేసినందుకు ఏమి ఇవ్వడం లేదన్నారు. రాగిజావ కు రెండు రూపాయల 2/-స్లాబ్ రేటు గాని లేదా కోడిగుడ్లు ప్రభుత్వంగానే సప్లై చేయాలని సూచించారు. లేని పక్షంలో రాబోయే కాలంలో ఆందోళన ఉదృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు . ఈ సమావేశంలో మండల అధ్యక్షురాలు బాలరాజు, సాయిలు, లక్ష్మి ,సులోచన, బాబాయ్, కార్మికులు పాల్గొన్నారు.