
సంక్రాంతి పండుగకు ఇంటిల్లిపాటి కొత్త పంటలు పిండి వంటలు కొత్త బట్టలు రంగురంగుల ముంగిళ్ళు ముస్తాబ్ అవుతుంటే మరికొందరు కోళ్ల పందాలకు సిద్ధమవుతున్నారు. సాధారణంగా కోళ్ల పందాలకు సంక్రాంతి పండగే ఒక పెద్ద వేదిక. ప్రభుత్వపరంగా ఈ పందాలు ఆడడం నేరమే అయినప్పటికీ ఎక్కడో ఒకచోట చాటుమాటుగా కొనసాగుతునే ఉన్నాయి. గత తొమ్మిది నెలల కాలంగా కోళ్లకు మేలి రకం దాన నాణ్యమైన రాగులు సజ్జలు బాదాం లు డ్రై ఫ్రూట్స్ వంటి మంచి పోషక పదార్థాల విలువలున్న ఆహారాన్ని అందిస్తూ బలిష్టంగా తయారు చేశారు. చరిత్రలో దేవతల కాలం నుంచి మొదలుకొని పల్నాటి చరిత్ర వరకు కోడి పందాలు కొనసాగుతూనే ఉన్నాయని అనాదిగా సాంప్రదాయ బద్ధంగా వస్తున్న ఒక కళాత్మకమైన పోటీ అని కోడిపందాలను అభిమానించేవారు తెలుపుతున్నారు. కోడికి కత్తి కట్టకుండా బెట్టు పెట్టకుండా ఆడాలన్నది నిర్ణయం కానీ అందుకు విరుద్ధంగా కోళ్లకు కత్తులు కట్టి వేలు లక్షల రూపాయలు బెట్టుగా పెట్టి కొనసాగిస్తుండడం వల్ల ప్రభుత్వం వీటిపై నిషేధం విధించింది. అయినా ఎక్కడో ఒకచోట ఎప్పుడు ఒకసారి దొంగ చాటుగా ఈ పందాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు దాడులు చేసిన సమాచారం ఉన్న మేరకు దొరుకుతున్నారు దొరకని వారు దొరల ఉంటున్నారు. ఈ సంక్రాంతికి కోడి పందాలు ఆడతా రాలేదా అనేది ఒక ఒక అనుమానం వెంటాడుతోంది. మండలంలోని కొన్ని గ్రామాలలో కొంతమంది ఎంతో ఇష్టంతో ప్రేమతో మంచి మంచి కోళ్లను జాతి రకాలను నెమలి డేగ కాకి వంటి రకాల కోళ్లను పెంచుతూ ఉంటారు. సంక్రాంతికి నెల రోజుల ముందు ఆంధ్ర నుండి పందెం వేసేవారు గ్రామాలలో తిరుగుతూ పెంచిన వారి అడ్రస్ సేకరించి వారి నుండి కోడిపుంజులను కొనుగోలు చేసి తీసుకువెళ్తారు. ఒక్కొక్క పుంజు 5000 నుండి 10000 వరకు ధర పలుకుతుందని పెంపకం దారులు తెలుపుతున్నారు. ఒక్కొక్కరు కనీసం 10 నుండి 20 పుంజులను పెంచుతారని అందరికీ పెంచడం వీలు కాదని పందెం కళ్లను పెంచడానికి ఒక ప్రత్యేకత ఉంటుందని అంటున్నారు. కోళ్ల పందాల గురించి వాటి ఆహారం గురించి ప్రతిరోజు కోడిపుంజులను ఒకదానికొకటి చేతులపై పొడిపిస్తూ ట్రైనింగ్ చేస్తామని అంటున్నారు. ఇప్పటికే ఆంధ్ర నుండి చాలామంది వచ్చి పుంజులను కొనుక్కొని తీసుకు వెళ్లినట్లు పలువురు కోడిపుంజుల పెంపకం దారులు తెలుపుతున్నారు.
పందెం కోళ్లను పెంచడం అంటే ప్రాణంగా భావిస్తాను.
ఆటో సాంబశివరావు గోవిందరావుపేట
సంక్రాంతి సమయానికి పందెం కోళ్లను పెంచడం ప్రాణం తో సమానంగా భావిస్తాను. వాటికి వేసే ఆహారము త్రాగునీరు వాటి ఆరోగ్య పరిస్థితి పై పూర్తి అవగాహన ఉన్నవాళ్లు మాత్రమే వీటిని పెంచగలుగుతారు. ఇది ఒక ప్రాచీన కళ రాను రాను అంతరించిపోతోందని అన్నారు. ఒకప్పుడు పందెం కొట్టే కంటే కోడి కాలుకు కత్తి కట్టడం నైపుణ్యం ఉన్నవాళ్లు కట్టాలని అనేవారని ఇప్పుడు కత్తి కట్టే నైపుణ్యం ఉన్నవాళ్లు మండలంలో కరువయ్యారని అన్నారు. ప్రభుత్వ దాడులకు భయపడి కూడా ఎవరు ముందుకు రావడం లేదు. మరికొంత కాలానికి కోడిపందాలు అంటే తెలియని జనరేషన్ చూస్తాం.