
– ఆకుపచ్చని తెలంగాణ నిర్మాణం సీఎం కేసీఆర్ లక్ష్యం..
– ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్..
నవతెలంగాణ-డిచ్ పల్లి
దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో హరితహారం సృష్టికర్త ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ఎందరో ముఖ్యమంత్రులుగా చేసిన అడవులు, మొక్కల పెంపకం పట్ల శ్రద్ధ తీసుకో లేదని, రాష్ట్రంలో మరో పామాయిల్ హరితహారం ఉద్యమం వస్తుందని,ఆకుపచ్చని తెలంగాణ రాష్ట్ర నిర్మాణం సీఎం కేసీఆర్ లక్ష్యమని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి సెంట్రల్ ఫారెస్ట్ నర్సరీ లో ‘హరితోత్సవం’ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జిల్లా యువ నాయకులు జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సంఘ సభ్యులు, ధర్పల్లి జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్మోహన్ తో పాల్గొన్నీ మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ హరితహారం సృష్టికర్త ముఖ్యమంత్రి కేసీఆర్ అని, కేంద్ర ప్రభుత్వం నిధులు క్యాంప ద్వారా వందల కోట్ల నిధులు ఉన్నాయని, గతంలో వాటిని అడిగే నాథుడు లేకుండా ఉండేవారని, కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి వారితో కొట్లాడి నిధులను తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందన్నారు.అటవీ శాతాన్ని పెంచాలన్న సదుద్దేశంతో సీఎం కేసీఆర్ ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వివరించారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు కోట్ల మొక్కలను నాటి సంరక్షించడంతో ఎక్కడ చుసిన పచ్చదనం పరిఢవిల్లుతున్నదని అన్నారు.ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా 273.33 కోట్ల మొక్కలు నాటామని రాష్ట్ర వ్యాప్తంగా 14, 864 నర్సరీల ఏర్పాటు చేశామని, హరితహారం నిర్వహణ కోసం ఇప్పటిదాకా 10,822 కోట్ల వ్యయం.19, 472 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు. (13,657 ఎకరాల్లో)2,011 బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటు. (6,298 ఎకరాల్లో) ఇదంతా హరితహారంతో సాధ్యం అయిందన్నారు.తొమ్మిదేళ్లలో అటవీ పునరుద్ధరణ ద్వారా సాధించిన విజయాలు13.44 లక్షల ఎకరాల అటవీ పునరుద్ధరణ, 2.03 లక్షల ఎకరాల్లో ప్లాంటేషన్ పూర్తి చేశామని చెప్పారు. 24.53 కోట్ల మొక్కలు నాటడం జరిగిందని,పునరుద్ధరణ ద్వారా పెరిగిన మొక్కలు 53.84 కోట్లు.10,886 కి.మీ. మేర అటవీ ప్రాంతాల చుట్టూ కందకాలు తవ్వకం,అగ్ని ప్రమాదాల నివారణ కోసం 21,452 కి.మీ. మేర ఫైర్ లైన్లు ఏర్పాటు చేయడం,నేల, తేమ పరిరక్షణ కోసం అడవుల్లో పెద్ద ఎత్తున నీటి యాజమాన్య పద్ధతులు అమలు,చెక్ డ్యాములు, ఇంకుడు చెరువులు, కుంటలు మొదలైనవాటి నిర్మాణం జరిగాయని తెలిపారు. పట్టణ ప్రాంత అటవీ ఉద్యానవనాలు (అర్బన్ ఫారెస్ట్ పార్కులు) & హరిత వనాలు రాబోయే రోజుల్లో తీర్మన్ పల్లి హైవే పక్కన 108 ఎకరాల్లో ₹ 5 కోట్ల రూపాయలతో అర్బన్ ఫారెస్ట్ పార్కు నిర్మాణం కాబోతుందని తెలిపారు.రాష్ట్రంలో 23 శాతం ఉన్న పచ్చదనం 9 ఏళ్ళ లౌ 7 శాతం పచ్చదనం పెంచమని, కోతులు వాపసు పోయి వానలు రావాలని కేసీఆర్ హరితహారం ప్రవేశపెట్టారన్నారు. హరిత తెలంగాణ కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంపీ లు,ఐ ఎ ఎస్ ల జీతల నుండి 1 శాతం సెస్ వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.నిధులను అనేక మార్గాల ద్వారా సమకూర్చారని,రాష్ట్రంలో వాణిజ్య పంటలను ప్రోత్సాహిస్తూ హరిత పామాయిల్ సాగు విస్తీర్ణం కోసం ప్రభుత్వం అనేక సబ్సిడీ లు ఇస్తుందని వివరించారు. ప్రభుత్వం ఇచ్చినా ప్రతి చెట్టును బతికించి ముఖ్యమంత్రి కేసీఆర్ కలను సాకారం చేయాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. కానీ కొంతమంది బీజేపీ నాయకుల తీరు చుస్తుంటే దేవుడి మీద కథలు చెప్పి ఓట్లు వేసుకుంటున్నారు కదా..అని మీరు రాముడు, శివుడి పేరు చెప్పి మీరు అన్ని వర్గాల్లో ఏ దేవుడు ఉంటాడో అది చెప్పి.. భజన కార్యక్రమాలలో దేవుడు గుడిలో కూడా రాజకీయాలు చేస్తు,దేశాన్ని అప్పుల మయంగా మార్చిన ఘనత బిజెపి పార్టీదన్నరు.ప్రభుత్వం నుండి నిర్వహిస్తున్న కార్యక్రమాలకు అందరూ అర్హులేనని కాని ఏదో ఒకటి సాకు పెట్టుకొని రాజకీయం చేయడం బిజెపి పార్టీకే చెల్లుతుందని ఆయన మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువ నాయకులు ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్ ,బిఅర్ఎస్ మండల అధ్యక్షులు చిలివెరీ దాస్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ, ఎఫ్ డి ఓ రాంకిషన్,ఇందల్ వాయి ఫారెస్ట్ రేంజ్ అధికారిని హిమచందన, డిప్యూటీ రేంజ్ అధికారులు శ్రీనివాస్, అసిఫోద్దిన్, సెక్షన్ అధికారులు ఎల్ సురెందర్, అనంద్, సుబ్బారావు, బాబురావు, రాజేశ్వర్ రావు, బిట్ అధికారులు, స్టికింగ్ ఫోర్స్ సిబ్బంది, తహసిల్దార్ టివి రోజా, ఎంపిడిఓ రాములు నాయక్, ఎంపిటిసిలు చింతల దాస్, మారంపల్లి సుధాకర్, కచ్చకాయల అశ్విని శ్రీనివాస్,డీకోండ సుదిర్,విజయ్ కుమార్,పాశం నర్సింలు, డిచ్ పల్లి ఎంపిటిసి లఫోరం అధ్యక్షులు సాయిలు, వివిధ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ అన్ని అనుబంధ సంఘాల నాయకులు, అటవీ శాఖ అధికారులు పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.