
– సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ఏర్పాటు తో ఉచితంగా నాణ్యమైన విద్య
– డా.బి.ఆర్.అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ తో విదేశీ విద్య సాకారం
– కులాంతర వివాహం ప్రోత్సాహం 2 లక్షల 50 వేయిలు
– తెలంగాణ కి తలమానికంగా హైదరాబాద్ లో డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు
– తెలంగాణ నూతన సచివాలయనికి డా.అంబేద్కర్ పేరు
– రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ కి సముచిత స్థానం కల్పించిన కేసీఆర్
– మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల
నవతెలంగాణ- కంఠేశ్వర్ :
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల జనార్దన్ గార్డెన్స్ లో మాదిగ ఆత్మీయ సమ్మేళనంలో గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ.. మాదిగల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. దళితులు ఆర్థికంగా వృద్ధి సాధించాలని దళిత బంధు అమలు చేస్తున్నాము. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలని స్థాపించి దళితులకు నాణ్యమైన విద్యని ఉచితంగా అందిస్తుంది ప్రభుత్వం. విదేశాల్లో చదువుకొనే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు డా.బి.ఆర్. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అందిస్తుంది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం లో ప్రతి కులం, ప్రతి మతం వారు సంతోషంగా ఉండాలని అనేక కార్యక్రమాలు అమలుచేస్తుంది ప్రభుత్వం. బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నిజామాబాద్ నగరం అభివృద్ధి చెందింది. నగరం లో ప్రతి డివిజన్ లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాము. చివరి మజిలీ గౌరవంగా సాగనంపేందుకు ఆధునిక సదుపాయాలతో వైకుంఠదామలు నిర్మించాము. ప్రజలకు ఉత్తమ సేవలు అందించడానికి మున్సిపల్ కార్యాలయం, సమీకృత కార్యాలయం నిర్మించాము. నిజామాబాద్ నగరం లోని ప్రధాన రోడ్లన్నీ విశాలంగా మార్చి సెంటర్ మీడియాన్ లైట్లను ఏర్పాటు చేసాము. బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం మరోసారి ఏర్పడ్డాక భాగంగా ప్రస్తుతం అందిస్తున్న ఆసరా పింఛన్ 2016 నుండి 5000 రూ.లకు పెంచుతాము. కళ్యాణ లక్ష్మీ ప్రోత్సాహకాన్నీ 100116 రూ.ల నుండి 200000 లక్షల రూ.లకు పెంచుతాము.మహిళలకు కేవలం 400 రూ.లకే వంట గ్యాస్ ని అందిస్తాము.
నిజామాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందలన్న , సంక్షేమం పథకాలు అమలు కావాలన్న కారు గుర్తుకి ఓటు వేసి బీ.ఆర్.ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, కార్పొరేటర్ లు కంపల్లి ఉమారని ముత్యాలు, బట్టు రాఘవేందర్, మాజీ కార్పొరేటర్ కనకం సుధ సదనంద్, మాదిగ సంఘం నాయకులు సిద్ధి రాములు, దండు శేఖర్, మందమరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.