నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల నేడు బీఆర్‌ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 10:45కు ఎరవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ఛాపర్లో బయలుదేరి 10.55కు గజ్వేల్ టౌన్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌పై ల్యాండింగ్ అవుతారు. అనంతరం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 1:40 గంటలకు కామారెడ్డికి బయలుదేరుతారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య కామారెడ్డిలో రెెండు నామినేషన్ సెట్లను వేయనున్నారు. అనంతరం సాయంత్రం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి సీఎం ప్రసంగించనున్నారు.