ప్రజా సంక్షేమం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయం

– మరొక్కసారి అవకాశం ఇవ్వండి మిగిలిన పనులు పూర్తి చేస్తా
– ఎన్నికల ప్రచారంలో హనుమంతు షిండే
నవతెలంగాణ- మద్నూర్:
ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట చంద్రశేఖర రావు రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారని ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో మరొకసారి అవకాశం ఇవ్వండి మిగిలిన పనులు పూర్తి చేస్తానంటూ ప్రజలకు జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిండే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా హామీ ఇచ్చారు జుక్కల్ నియోజకవర్గం లోని నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండలంలో ఎమ్మెల్యే హనుమంతు షిండే గురువారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు డోంగ్లి మండలంలోని కుర్లా ఎనబోరా దోతి మల్లాపూర్ మారేపల్లి లక్ష్మాపూర్ మోగా ఈ ఏడు గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే హనుమంతు సిండే తో పాటు ఎంపీ బీబీ పాటిల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల కోసం కల్పిస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలియపరుస్తూ మరొకసారి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు ఈ ఎన్నికల ప్రచారంలో ఎంపీపీ వాగుమారే లక్ష్మీబాయి జెడ్పిటిసి సభ్యురాలు అనిత కథలయ్య బీఆర్ఎస్ పార్టీ దొంగ్లి మండల అధ్యక్షులు శశాంక్ పటేల్ మండల అధ్యక్షులు బన్సీ పటేల్ దొంగ్లి సింగిల్ విండో చైర్మన్ డిసిసిబి డైరెక్టర్ రామ్ పటేల్ ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు