
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయుటలో ముఖ్యమంత్రి మొదటి ప్రాధాన్యత ఇచ్చారని ఎన్డి సీసీబీ అధ్యక్షులు రమేష్ రెడ్డి అన్నారు. నిజామాబాదు జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షులు శ్రీ కుంట రమేష్ రెడ్డి ని మండలంలోని కొలిప్యాక్ సింగిల్ విండో అధ్యక్షులు శ్రీ నాగుల శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలిసారు. అనంతరం రమేష్ రెడ్డి శాలువాతో సన్మానిస్తూ పుష్పగుచ్చమిస్తూ అభినందించారు. రమేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయుటలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఇవ్వడమైనదని తెలిపారు.ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గకి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కి, ఎన్డి సిసిబి అధ్యక్షులు రమేష్ రెడ్డి కి నాగుల శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేశారు.