
గాంధారి మండలకేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో దశాబ్దాల కాలంగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ కృషి ఫలితంగా ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీ లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గాంధారి మండల మాదిగలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అంబేద్కర్ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొమ్మని బాలయ్య మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడి విజయం సాధించిన మందకృష్ణ మాదిగకు ఎస్సీ వర్గాల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నవయుగ అంబేద్కర్ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి మాదిగ జాతి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పెద్ద బూరి గంగారం, నాయకులు గండ్యటం సాయిలు అంబేద్కర్ సంఘం కార్యాలయ సభ్యులు కులస్తులు తదితరులు పాల్గొన్నారు.