ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలి..

– కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్ 
నవతెలంగాణ – డిచ్ పల్లి
సోమవారం నిజామాబాద్ లో జరగబోయే  జన జాతర కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గోంటున్నరని ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు నాయకులు అదిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఇందల్ వాయి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి టి. జీవన్ రెడ్డి  నామినేషన్ వేస్తున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని,ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి  విచ్చేస్తున్నారని, ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కార్యోన్ముఖులై మీ గ్రామాల నుండి పెద్ద ఎత్తున కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని,జూన్ జాతర  సభావేదిక కలెక్టర్ గ్రౌండ్ (పాతది) నిజామాబాద్ సమయం ఉదయం 11 గంటలకు ఉంటుందని అద్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్ తెలిపారు.