– పాలడుగు వెంకటకృష్ణ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు
నవతెలంగాణ-గోవిందరావుపేట
రేపు మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటకృష్ణ తెలిపారు. గురువారం మండల కేంద్రంలో వెంకటకృష్ణ మీడియాతో మాట్లాడుతూ మంత్రి సీతక్క మరియు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనల మేరకు మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఇందిరా గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం ఉదయం 10 గంటలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ జన్మదిన వేడుకలకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను అట్టహాసంగా నిర్వహిద్దామని అన్నారు.