గల్ఫ్ పాలసీ పట్ల ముఖ్యమంత్రి శ్రద్ధ తీసుకోవడం అభినందనీయం

నవతెలంగాణ – ఆర్మూర్ 

గల్ఫ్ పాలసీ ఏర్పాటుపై, గల్ఫ్  కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చోరువ చూపడం అభినందనీయమని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఎన్నారై అధ్యక్షులు బట్టు స్వామి గురువారం తెలిపారు. రైతుల తరహాలోనే గల్ఫ్ కార్మికులకు కూడా జీవిత బీమా సౌకర్యం కల్పిస్తామని, తెలంగాణ గల్ఫ్ అండ్ అధర్ ఓవర్సీస్ వర్కర్స్ విల్పర్ బోర్డు ద్వారా గల్ఫ్ తో పాటు ఇతర దేశాలలో ఉన్న తెలంగాణ వారి హక్కులకు రక్షణ కల్పించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం హర్షనీయమని అన్నారు. తెలంగాణ ప్రజలకు గల్ఫ్ గోస లేకుండా చూడాలని, ఎన్నారై సెల్ ను ప్రతిష్టం చేయాలని, కేరళ తరహా పాలసీని రూపొందించాలని తెలిపారు.