బాధితురాలికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు సోమవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకట కృష్ణ పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని గోలి పెద్దమ్మ గత కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో వైద్యశాల యందు చేరగా మెడికల్ ఖర్చుల నిమిత్తం వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు రాగా వెంటనే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ బాధితురాలికి ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కును అందజేశారు. ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిక్షణం పరితపిస్తూ ఉంటుందని అన్నారు. పేదవారి ఆరోగ్యం కాపాడడం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని కార్పొరేట్ వైద్య సేవ అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పులుగుజ్జు వెంకన్న, పెండెం శ్రీకాంత్, కణతల నాగేందర్ రావు, మండల ప్రధాన కార్యదర్శి తేళ్ల హరిప్రసాద్, మండల మహిళా అధ్యక్షురాలు మద్దెల నాగమణి, ఎండి. మాజితా, నన్నెబోయిన కృష్ణ స్వామి, సింగాపురం కృష్ణ, తుమ్మల శివ, చిక్కుల్ల వెంకటేష్, తోకల అహల్య, గోపీదాసు వజ్రమ్మ తదితర నాయకులు పాల్గొన్నారు.