డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘనపూర్ గ్రామంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ షాదుల్లా, నాయకులు రామకృష్ణ సవిత, సొసైటీ డైరెక్టర్ సతీష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ లింబాద్రి, హరీష్ పటేల్, గంగి భూపతి, శంకర్ గౌడ్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.