నవతెలంగాణ – పెద్దవంగర
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రామచంద్రు తండా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చిక్కాల సతీష్ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని చిట్యాల కాంప్లెక్స్ హెచ్ఎం అర్రోజు విజయ్ కుమార్ అన్నారు. బుధవారం సతీష్ తన సొంత ఖర్చులతో చిన్నవంగర ప్రాథమికోన్నత పాఠశాలకు రూ. 7 వేలు విలువ చేసే రెండు గ్రీన్ బోర్డులు వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దేవదాస్ తో కలిసి మాట్లాడారు. పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలకు ఆయన సుధీర్ఘ కాలంగా చేయూతను అందిస్తున్నారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని కలిగి ఉండాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నేడు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్య అందుతుందని చెప్పారు. మన ఊరు -మన పాఠశాలలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి సతీష్ ను అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాజీ సర్పంచ్ రామకృష్ణ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.