బాలవికాస కేంద్రాలు ప్రగతి అభివృద్ధి సోపానాలు 

Child Development Centers are stepping stones to progress– పైడాకుల అశోక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
నవతెలంగాణ – గోవిందరావుపేట
బాదావికాస స్వచ్ఛంద సేవా కేంద్రాలు ప్రగతి అభివృద్ధి సోపానాలు అని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ అన్నారు. శుక్రవారం మండలంలోని బుసాపురం గ్రామంలో బాలవికాస మహిళా కేంద్రం తరుపున ఏర్పాటుచేసిన మంచి నీటి కేంద్రాన్ని అశోక్ ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి అశోక్ మాట్లాడుతూ.. ప్రజలకు సురక్షిత నీరు అందించడమే లక్ష్యంగా బాల వికాస కేంద్రాలు ముందుకు సాగుతున్నాయి అన్నారు. మహిళా సంఘాలను ప్రోత్సహించడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం అని, బాల వికాస కేంద్రాలు ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రగతి పథంలో నడుస్తుందని అన్నారు. అలాగే బాల వికాస కేంద్రాలు ముఖ్యంగా ప్రజలకు సురక్షిత మంచి నీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని, అలాగే వితంతువుల సాధికారత, అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని ఉచిత విద్య అందించి ప్రయోజకులను చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని, వృద్దులు మరియు నిరాశ్రయులకు అండగా నిలబడి వారికి ఆశ్రయాన్ని ఇస్తుందని, కరోనా సమయంలో కూడా వారు కరోనా గురించి అవగాహన కల్పిస్తూ, కరోనా రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో అందరికీ తెలియజేస్తూ, కరోనా బారిన పడిన వారిని ఎలా చూసుకోవాలి అని వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ, ప్రజలందరికీ అండగా నిలబడింది బాల వికాస కేంద్రం అని అన్నారు. బాల వికాస కేంద్రం ఏర్పాటు చేసిన సురక్షిత మంచి నీటి కేంద్రాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక మండల అభివృద్ధి అధికారి జవహర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి జితేందర్ రెడ్డి, బాల వికాస ఎండి మదన్ మోహన్ రెడ్డి, ప్రాజెక్టు మేనేజర్ బాల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పాశం మాధవ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య, సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి, యువజన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింత క్రాంతి, బేతి దేవేందర్ రెడ్డి, పాలెం యాదగిరి, రాజబాబు, గంప సురేష్, మర్కాల రాజశేఖర్ రెడ్డి, బండపెల్లి శివుడు, దీకొండ భరత్, తుమ్మల శివ, బాల వికాస మహిళా కేంద్రం సభ్యులు అందరూ పాల్గొన్నారు.