– ఎన్నికల ప్రచార కార్యక్రమ ఖర్చుల కోసం..
నవతెలంగాణ-జగిత్యాలటౌన్
కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ జగిత్యాల నియోజకవర్గ అభ్యర్థి జీవన్‌రెడ్డికి ఓ చిన్నారి ప్రచార కార్యక్రమానికి విరాళం అందజేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల మండలం చల్‌గల్ గ్రామానికి వెళ్లిన జీవన్‌రెడ్డికి శ్రీనిత్య తన కిడ్డీ బ్యాంక్‌లో జమ చేసుకున్న రూ.4792 విరాళంగా అందజేసింది. దాంతో బాలికను ఎత్తుకుని జీవన్‌రెడ్డి ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.