అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తే ఆట పాటలతో పాటు విద్య అల పడుతుందని చేర్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అంకుగారి స్వరూప,ఐసిడిఎస్ సూపర్వైజర్ నాగమణి లు తెలిపారు.చేర్యాల పట్టణ కేంద్రంలోని 7, 8, 9, 12 అంగన్వాడి సెంటర్లతో కలిపి శుక్రవారం అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సరీ,ఎల్కేజీ, యూకేజీ లు అంగన్వాడీ కేంద్రాలలోనే పూర్తి అవుతుందని పిల్లల తల్లులకు వివరించారు.అంగన్వాడి కేంద్రాలలో మొక్కలు నాటడం, కిచెన్ గార్డెనింగ్, తాగునీటి సౌకర్యాల గూర్చి వివరించారు. పిల్లలు, గర్భిణీలు, బాలింతలు శుభ్రత పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏ ఎన్ ఎం లు విజయలక్ష్మి, అమృత, అంగన్వాడి టీచర్లు ఆముదాల బాలమణి ,సుందరి రేణుక,బాలమణి హెల్పర్ రేణుక,ఆశా వర్కర్లు నాగలక్ష్మి, పద్మ,లక్ష్మి,బాలమణి,విజయ తోపాటు గర్భిణీలు,బాలింతలు, పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు.