– ఎంపీపీ ప్రభాకర్
నవతెలంగాణ-బంట్వారం
బాల్య వివాహాలు చేయడం చట్టప్రకారం నేరమని, మండలంలోని బాలలందరికీ రక్షణ, సంరక్షణ కల్పించవ లసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బంట్వారం ఎంపీ పీ ప్రభాకర్ అన్నారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాల యంలో ఐసీడీఎస్- చైల్డ్ లైన్ 1098 ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహనా సదస్సు నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…బాల్య వివా హాలు చేయడం వలన తొందరగా గర్భవతులు అవడంతో పాటు ప్రసవ సమయంలో తల్లీబిడ్డలకు ప్రాణహాని ఉం టుందన్నారు. 18 ఏండ్లలోపు బాలికలకు, 21 ఏండ్లలోపు యువకులకు పెళ్లిళ్లు చేయడం బాల్యవివాహాల నిరోధక చట్ట ప్రకారం నేరమన్నారు. బాల్యవివాహాలు చేసుకున్న, సహకరించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయ న్నారు. పురోహితులు, కాజీలు, పాస్టర్లు పెండ్లి నిర్ణయించే సమయంలో స్కూలు బోనోఫైడ్ తప్పనిసరిగా తీసుకోని 18 ఏండ్లు నిండితేనే పెళ్లిళ్లు పెట్టాలని కోరారు. ప్రతి గ్రా మంలో సర్పంచ్లు చొరవ తీసుకుని బాల్యవివాల నిషేధం గురించి గ్రామపంచాయతీ ఆవరణలో ప్రధాన చౌరస్తా లలో వాల్‌రైటింగ్ రాయించాలని కోరారు. ప్రతి గ్రామం లో ఉన్న వీసీపీసీ కమిటీ సమావేశాలు నిరంతరం నిర్వ హించి కిశోర బాలికల పర్యవేక్షణ చేయాలన్నారు. బాల లకు ఎలాంటి సమస్యలున్నా చైల్డ్‌లైన్ 1098, డయల్ 100లకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సంతోష, ఎంపీడీవో బాలప్ప, ఎస్సై ఆనంద్ కు మార్, తులసీరామ్, పిహెచ్ సి డాక్టర్ మానస, ఏపీవో విజరు కుమార్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పార్వతి దేవి, చైల్డ్‌లైన్1098 కౌన్సిలర్ రామేశ్వర్, ఐసిపిఎస్ ఔట్రీచ్ వర్క ర్ జ్యోతి, వివిధ గ్రామాల సర్పంచులు అంగన్‌వాడీ టీచర్లు ఆశా కార్యకర్తలు ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.