– ధారూర్ బాలికల ఉన్నత పాఠశాలలో అవగాహనా సదస్సు
– సాధన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహణ
నవతెలంగాణ-ధారూర్
బాల్య వివాహాలను నిర్మూలించాలని వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు సూచించారు. ధ రూర్ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠ శాల ప్రధానోపాధ్యాయులు కే.ప్రభాకర్ అధ్యక్షతన సాధన సంస్థ ప్రెసిడెంట్ మురళీమోహన్ ఆధ్వర్యం లో బాల్య వివాహాలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు హారై మాట్లాడారు.. బాల బాలికలను బడికి పంపించాలన్నారు. అప్పుడు బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం సాధ్యం అన్నారు. బాల కార్మికులు లేని దేశంగా భారత్‌ను, రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్నారు. బాల్య వివాహ రహిత రాష్ట్రంగా రూపుదిద్దడం కోసం అందరూ కృష చేయాలన్నారు. బాలల అక్రమ రవాణాను అరి కట్టాలన్నారు. బాలలందరి హక్కులను సంపూర్ణంగా పరిరక్షించాలన్నారు. ఇందుకు సాధన సంస్థ పని చేస్తుందన ఆ సంస్థ ప్రెసిడెంట్ చిక్కు మురళీ మోహన్ తెలిపారు. తమ వంతు సహాయ, సహకారాలు ఎల్లవేళలా అందించడానికి తాము సిద్ధంగా ఉంటామని తెలిపారు. బాలి కలు బాగా చదువుకోవాలని సూచించా రు. చదువుతోనే అన్ని సాధించొచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్వీ స్ లీగల్ సర్వీస్ అథారిటీ వెంకటేష్, బీడబ్ల్యూ జెండర్ స్పెషలిస్ట్ వరలక్ష్మి, ఫైనాన్షియల్ లెటర్ ఎస్సీ బీడబ్ల్యుఓ డీడబ్ల్యూ వెంకటేశం, ధరూ్ ఏఎస్‌ఐ సంగమేశ్వర్, హెడ్ కానిస్టేబుల్ అల్లిము ద్దీన్, మాజీ సర్పంచ్ చంద్రమౌళి, సాధన సంస్థ సభ్యులు, స్థానిక పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.