– అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం
నవతెలంగాణ – శంకరపట్నం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళల చిన్నారుల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందని అంగన్వాడీ సూపర్వైజర్ స్రవంతి అన్నారు. శుక్రవారం శంకరపట్నం మండల పరిధిలోని ముత్తారం గ్రామ అంగన్వాడి కేంద్రంలో కార్యక్రమాన్ని నిర్వహించి ఆరోగ్య రక్షణ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ స్రవంతి మాట్లాడుతూ, మహిళలు గర్భిణీ స్త్రీల చిన్నపిల్లల రక్షణ ధ్యేయంగా కేంద్ర,, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల ద్వారా అనేక సేవలందిస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. పాఠశాలలకు సెలవులు ప్రారంభమైన జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ఉత్తర్వుల మేరకు ముత్తారం గ్రామంలో స్నేహిత కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలకు గర్భిణీ స్త్రీలకు రక్తహీనత పై అవగాహన కల్పించి, పౌష్టిక ఆహరం వినియోగంపై, క్షేత్రస్థాయి అవగాహన కల్పించినట్లు తెలిపారు. మహిళలు ప్రభుత్వము అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందాలని సూచించారు. చిన్నారుల ఎదుగుదల క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నమోదు చేసి నివేదికలు తయారుచేసి ఉన్నతాధికారులకు చిన్నారుల ఎదుగుదల మహిళల, బాలికల ఆరోగ్యం పూర్తి సమాచారాన్ని అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి దేవిక, అంగన్వాడీ టీచర్ భాగ్య, కవిత, ఆశ వర్కర్ మల్లీశ్వరి, పద్మ ,గర్భిణీ స్త్రీలు మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.