
అనాధ పిల్లలను జిల్లా శిశు సంక్షేమ శాఖ గురువారం దత్తతగా తీసుకున్నారు. మండలంలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన శ్యామర్తి సత్తయ్య ఆయన భార్య బుజ్జి ఇటీవల మృతి చెందగా వారి ఇద్దరి పిల్లలు అనాధలుగా మారారు. ఈ విషయాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులు శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందించగా వెంటనే బాల సంరక్షణ అధికారి స్రవంతి గ్రామానికి వచ్చి పిల్లలను దత్తతగా తీసుకొని బాలల సదనానికి తీసుకెళ్లారు. అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో విద్యార్థులకు బాలల హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సాయి రెడ్డి, గ్రామ సర్పంచ్ స్వామి, చిల్డ్రన్ ప్రొడక్షన్ సోషల్ వర్కర్ వీణ, అంగన్వాడీ కార్యకర్త సుచరిత పాల్గొన్నారు.