
108 అంబులెన్స్ లో గర్భిణీ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఘటన బుధవారం వేమనపల్లి మండలంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే సూరారం గ్రామానికి చెందిన కుక్కల శ్రీలత కి నెలలు నిండాయి. బుధవారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. గర్భిణీ కుటుంబ సభ్యులు వేమనపల్లి108 సమాచారం ఇచ్చారు.గర్భిణీ యొక్క బంధువులు అంబులెన్స్ వచ్చేలోపు ఆటోలో తీసుకెళ్దాం అని వెళుతున్న క్రమంలో అంబులెన్స్ సిబ్బంది కాస్త ఆలస్యమైన మేము వస్తాము అక్కడే ఆగండి అని చెప్పి వారి దగ్గరికి చేరుకొని గర్భిణీ స్త్రీని అంబులెన్స్ లో ఎక్కించుకొని వెళుతున్న క్రమంలో దారిలో పురిటి నొప్పులు అధికం అయ్యాయి. దీంతో మార్గ మధ్యలో అంబులెన్స్ ఆపి అంబులెన్స్ పైలెట్ ముజామిల్, ఈఎంటీ సాహిర్ పాషా గర్భిణీ కుటుంబ సభ్యుల సహకారంతో అంబులెన్స్ లోనే సుఖ ప్రసవం చేశారు. శ్రీలత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. వారిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తల్లి,బిడ్డను పరీక్షించి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. సుఖ ప్రసవం చేసిన అంబులెన్స్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.