సామాజిక సేవకున్ని సన్మానించిన చిన్ననాటి మిత్రులు..

Childhood friends who honored the social worker..నవతెలంగాణ – ఆర్మూర్ 

జాతీయ స్థాయిలో భారత సేవ రత్న పురస్కారం అందుకున్న సందర్భంగా బాలుర ఉన్నత పాఠశాల లో చదువుకున్నా చిన్ననాటి స్నేహితులు పట్వారీ తులసి కుమార్ ను పూలమాల శాలువాతో ఆదివారం సన్మానించినారు. స్థానిక బాలుర పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించినారు. వీరి సేవలు మాలాంటి స్నేహితులకు , నేటితర యువతరానికి విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని వారికి మేము ఎల్లప్పుడూ సహకారంగా ఉంటామని తెలిపారు.