మహాజాతర సమీపిస్తున్న వేళ.. పిల్లలు జాగ్రత్త

నవతెలంగాణ – మహాముత్తారం 
మహా జాతర సమీపిస్తున్న వేళ భారీ సంఖ్యలో  వాహనాలు రాకపోకలు  ఉంటాయని పిల్లలను రోడ్లపై పోకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక ఎస్సై సుధాకర్ దసరి అన్నారు. గురువారం  మండల పరిధి లొని కాటారంనుండి మేడారం రోడ్డు కు ఇరువైపులా ఉన్న గ్రామాలు  కొర్లకుంట, యామన్ పల్లి , నిమ్మగూడెం, పెగడపల్లి, బోర్లగూడెం, రేగుల గూడెం, స్తంభంపల్లి,  సింగారం గ్రామ ప్రజలకు ఎస్సై హెచ్చరిక జారీ చేశారు.మేడారం మహా జాతర సమి పి స్తున్నందున  జాతరకు భారీ సంఖ్యలో వాహనాలు రాకపోకలు జరుగుతుంది. కావున ప్రజలు ఎవరు తమ పిల్లలను ఒంటరిగా వదలకూడదని ఇంట్లోనే ఉంచుకోవాలని పిల్లలపై ఒక కన్నేసి ఉండాలని సూచించారు. అంతేకాకుండా పశువులు ఎడ్లు బర్లు ఎడ్లబండ్లు మరియు ట్రాక్టర్లు చీకట్లో కూడా గుర్తించే విధంగా రేడియం స్టిక్కర్స్ లేదా రేడియం పెయింట్ ఉపయోగించి యాక్సిడెంట్స్ నివారణకు తోడ్పడాలని సూచించడమైనది.