పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో అలరించిన చిన్నారులు

నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం ఆదర్శ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో చిన్నారుల నృత్యాలు పలువురిని ఆకర్షించాయి. ఈ సందర్భంగా 9వ తరగతి విద్యార్థులు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు కష్టమైన ఇష్టంతో చదివి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచి మంచి ర్యాంకులు సాధించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బలరాం, చెన్నప్ప, అయిషా, జ్యోతి, సుష్మ, సౌమ్య, సంతోష్, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.