– పారిపోయిన ఎనిమిది మంది
నవతెలంగాణ – కుత్బుల్లాపూర్
జువైనల్ హోం నుంచి ఎనిమిది మంది పిల్లలు తప్పించుకున్న ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధి కైసర్‌నగర్‌లో జరిగింది. వివరాల్లోకెళ్తే.. మంగళ వారం రాత్రి జువైనల్ హోం తరగతి గది కిటికీ గ్రిల్స్‌ను తొలగించి ఓ బాలుడు పారిపోయాడు. అనంతరం అలాగే మరో ఏడుగురు పారిపోయారు. బుధవారం ఉదయం హోం నిర్వాహకులు సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల సీసీటీవీ కెమెరాల ఆధారంగా పిల్లలు ఎటు వైపు వెళ్లారో తెలుసుకునే పనిలో ఉన్నారు. పారిపోయిన చిన్నారులు సయ్యద్ మైరాజ్ ఏ మెహ్రాజ్, షేక్ రెహాన్, సయ్యద్ ఆజం, సయ్యద్ సోహైల్, షేక్ అబ్దుల్ హక్‌ఏ ఇమ్రాన్, మొహమ్మద్ రెహాన్, మొహమ్మద్ హకీమ్, మొహమ్మద్ మహబూబ్ అని పోలీసులు తెలిపారు.