నవ తెలంగాణ -తాడూర్
మండల పరిధిలోని ఆదివారం బడిబాటలో బడిఈడూ పిల్లలను బడిలో చేర్పిం చాలని ఇంటింటికీ వెళ్లి ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. మండల వ్యాప్తంగా ఐతోల్, బలంపల్లి, తుమ్మల, సుగురు, మేడిపూర్, అల్లాపూర్ గ్రామా ల్లో పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమంలో పా ల్గొన్నారు. ఈ కార్యక్ర మంలో ఐతోల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయు లు ఆవులలక్ష్మణ్, ప్రధానో పాధ్యాయులు కట్ట శ్రీనివాస్‌రెడ్డి, అంతారం హెచ్‌ఎం శేషగిరి, విద్యార్థులు తల్లిదం డ్రులు తదితరులు పాల్గొన్నారు.