పిల్లలను బడికి వెళ్ళేలా సంసిద్ధం చేయాలి

– సీడీపీఓ కె.మంగతార
నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
ఐదు సంవత్సరాల వయసు పూర్తిగా నిండి, ఆరు సంవత్సరాలు తగిలిన పిల్లలను వెంటనే బడికి వెళ్ళేలా అంగన్వాడీ కేంద్రంలో సంసిద్ధం చేయాలని టేకులపల్లి ఐసీడీఎస్ సీడీపీఓ కె.మంగతార అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. ఈ మేరకు శనివారం మండల పరిధిలోని రాయిపాడు గ్రామం అంగన్వాడి కేంద్రంలో ప్రతి నెలా నాల్గో శనివారం నిర్వహించే పూర్వ ప్రాథమిక విద్యా రోజు(ఈసీసీఈడే) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీడీపీఓ కె.మంగతార హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ 3 సంవత్సరాలు నిండిన పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని కోరారు. ఐదు సంవత్సరాల వరకు పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో ఆట పాటల ద్వారా విద్యను  అందించటం జరుగుతుందన్నారు. ఆరో యేటలో పిల్లలను అంగన్వాడీ టీచర్లు ప్రాథమిక పాఠశాలలో విధిగా జాయిన్ చేయాలని చెప్పారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని వీడి ప్రాథమిక పాఠశాలలో చేరే పిల్లలకు వీడ్కోలు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక అంగన్వాడీ సూపర్వైజర్ కె.విజయకుమారి, రాయిపాడు గ్రామం సెక్రటరీ ఎం.రమేష్, అంగన్వాడీ టీచర్ పి.సుజాత, గ్రామస్తులు పాల్గొన్నారు.