
సరైన సమయంలో చిన్నారుల తల్లిదండ్రులు పిల్లలకు టీకాలు వేయించాలని మెడికల్ అధికారి దివ్య తెలిపారు. బుధవారం మండలంలోని ఇసాన్నపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య సబ్ సెంటర్ ను సందర్శించి రికార్డులు, టీకాల వివరాలు, వ్యాక్సిన్ గడువు తేదీ వివరాలు పరిశీలించారు. చిన్నారుల టీకాల విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ప్రశాంత్, ఆరోగ్య విస్తరణాధికారి వెంకటరమణ, ఏఎన్ఎం యశోద, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, తదితరులు ఉన్నారు.