బిట్స్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ-పరకాల టౌన్ : పరకాల పట్టణంలో గురువారం రోజున బిట్స్ పాఠశాలలో ప్రిన్సిపల్ యుగేందర్ అధ్యక్షతన  బాలల దినోత్సవ వేడుకలు మరియు స్వయం పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు  విద్యార్థుల ఉద్దేశించి ప్రసంగిస్తూ భారతదేశ మొదటి ప్రధాని అయిన నెహ్రూ కు పిల్లలంటే చాలా ఇష్టమని, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, ప్రతి విద్యార్థి బాల్య దశ ఎంతో ముఖ్యమైనదని, అలాంటి బాల్య దశలో చిన్నారులపై జరుగుతున్నటువంటి అనేకమైన ఆకృత్యాలు పట్ల సమాజంలోని పౌరులందరూ సరైన విధంగా ప్రవర్తించాలని చైర్మన్ గారు తెలియజేయడం జరిగింది. అలాగే ప్రిన్సిపల్ యుగంధర్ మాట్లాడుతూ  ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవం  కూడా జరుపుకున్నందున టీచర్ యొక్క ప్రాముఖ్యత విద్యార్థుల భవిష్యత్తు పట్ల వారి యొక్క అంకితభావాన్ని తెలియజేయడం జరిగింది.  నిర్వహించినటువంటి ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలలో గెలుపొందిన  విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి,, ప్రిన్సిపాల్ యుగంధర్  తో పాటు, నేడు ప్రిన్సిపాల్ గా వ్యవహరించిన శ్రీ ధృతి, వైస్ ప్రిన్సిపాల్ గా శివ బాలాజీ, ఇన్చార్జిగా భవ్యశ్రీ, ఎంఈఓ గా స్టీవెన్, డీఈవోగా అశ్వంత్ మరియు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది పాల్గొనడం జరిగింది.