నవతెలంగాణ-కంటేశ్వర్ : మంగళవారం స్థానిక మారుతినగర్లోని స్నేహ సొసైటి ఫర్ రూరల్ – -రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో బాలల దినోత్సవాన్ని ఘనంగా – నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బి ముఖ్య -అతిధిగా పాల్గొని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు ఆర్పించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు జవహార్ లాల్ నెహ్రూంకి పిల్లలంటే మక్కువ కలిగిన వ్యక్తిగా ఆయన పుట్టినరోజును బలల దినోత్సవంగా జరుపుకుంటామన్నారు. పిల్లలు దైవంతో సమానం కాబట్టి పిల్లలకు సేవ -చేయడం ద్వారా పుణ్యాన్ని పొందవచ్చు, అందులను దివ్యాంగులకు సేవా చేయడం ద్వారా పుణ్యాన్ని పొంది స్వరానికి వెళ్తాం అని అన్నారు. కార్యక్రమంలో దివ్యాంగ బాలలు ప్యాన్సీ డ్రస్సు వేశాదారణలో నటించడమే కాకుండా మంచి డైలాగులతో అందరిని అలరించగలిగారనీ వీరు సకలాంగులతో సమంనంగా సాంస్కృతిక కార్యక్రములు మరియు యోగా నిర్వహించారని వారికి శిక్షణ యిచ్చిన సిబ్బందికి మరియు యుజామున్యానికి ధన్యవాదాలు తెల్పారు.ఈ కార్యక్రమునికి గౌరవ అతిధిగా పాల్గొన్న డా| రవితేజ మునసిక – వైద్య నిపుణుడు ముట్లాడుతూ మనిషి ఏది చేసిన తన సంతోషం కోసం, ఆనందంకోసం చేస్తాడు కావున ప్రతిఒక్కరు జీవితంలో ఒక మంచి పని చేసి సంతోషంగా ఉండాలని అన్నారు. దివ్యాంగులల (మానసికవికలాంగబాలలు) వారికి బాధ దుంఖం ఏది తెలవదు అని వారు ఎల్లప్పుడు సంతషంగా నవ్వుమొఖంతో ఉంటారని అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులు విచిత్ర వేషధారణతో వివిధ నాయకులను పోలి అభినయించారు. ముఖ్యంగా జాతిపిత మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ ఝాన్సీ లక్ష్మీబాయి, అంబేద్కర్ అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ మదర్ తెరిస్సా, చాకలిఐలమ్మ, నోయ భుల్లాఖన్,సైనికుడు, పంతులు, కొమరంభీం, కోయధార, నోదమ్మ, రాధాకృష్ణుడు, స్వచ్ఛభారత్ మరియు హనుమూన్ జ పాత్రలలో విచిత్ర వేశాధారణ చేశారు. ఈ కార్యక్రవనిని స్నేహ సొసైటి కార్యదర్ని యస్. సిద్దయ్య, కార్యవరసభ్యుడు విరేశం, డా॥ మానస్, ప్రిన్సిపాల్ ఎస్, జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి, గంగాధర్ మునసిక వికలాంగులు, ఆంధులు, సిబ్బంది, దివ్యాంగ బాలల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమములో దివ్యాంగబాలలు, సాంస్కృతిక కార్యక్రములు మరియు యెగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా పోటిలలో నిర్వహించి బాలలకు విజేతలు అయినవారికి బహుమతులు ప్రధానం చేశారు ఈ కార్యక్రమములో పాల్గోన అతిథిలకు యూజమాన్యం సన్మానించారు.