చాచా నెహ్రూ 135 జయంతిని పురస్కరించుకొని ఎంపీ యుపిఎస్ కొండాపురంలో బాలల దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయులు భూతం ముత్యాలు ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి వారు చేసిన సేవలు కొనియాడుతూ వారికి పిల్లలన్న ఎర్ర గులాబీలు అన్న చాలా ఇష్టమని ఆయన పిల్లలకు వివరించారు. పుట్టినరోజులు దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారని ఈ సంవత్సరం పాఠశాలలో వేడుకలు నిర్వహిస్తూ అందులో భాగంగా పిల్లలచే పాటలు డాన్స్ నృత్య ప్రదర్శన, స్పీచ్ తదితర ఆక్టివిటీస్ చేయిస్తూ, పిల్లలకు ఆట పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు.