– కాలం చెల్లిన సెలైన్ బాటల్‌తో వైద్యం
– శంకర్‌పల్లిలోని ఇందిరా ఆస్పత్రిలో ఘటన
– ఆస్పత్రి రిజిస్ట్రేషన్ డాక్టర్ ఒకరు.. వైద్యం చేసేది మరొకరు
– పట్టించుకోని వైద్యాధికారులు
నవతెలంగాణ-శంకర్‌పల్లి
మా వైద్యం… మా ఇష్టం… అనే రీతిలో శంకర్‌పల్లిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రి పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని ఇందిరా ఆస్పత్రిలో కాలం చెల్లిన సెలీన్ ఎక్కించడంతో ఓ పాప అనారోగ్యా నికి గురైంది. పరిగికి చెందిన సృజన అనారోగ్యంతో ఇందిరా ఆస్పత్రిలో వైద్యం చేసుకుందామని వచ్చింది. అక్కడి డాక్టర్ వైద్యం చేసేది పోయి, కాల పరిమితి అయి పోయిన సెలీన్ బాటల్ ఎక్కించడంతో ఆ బాలిక అనారో గ్యం విషమించింది. దీంతో సంగారెడ్డిలోని సన్‌రైస్ ఆస్పత్రికి తరలించారు. గతంలో కూడా ఈ ఆస్పత్రిపై అనేక విమర్శలు వచ్చాయి. రా జకీయ ఒత్తిళ్లు లేక ముడుపుల కారణంతో ఈ ఆస్పత్రిపై వైద్యాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆస్పత్రి రిజిస్ట్రేషన్ డాక్టర్ స్థానంలో మరో డాక్టర్ వైద్యం చేస్తు న్న ఉన్నత అధికారులు మాత్రం ఈ ఆస్పత్రిపై ఎలాంటి చర్యలు తీసువడం లేదని స్థానికులు ఆరోపించారు. కాల పరిమితి అయినా మందులతో వైద్యం చేసే ఇలాంటి ఆస్పత్రులపై వైద్యాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.