నవతెలంగాణ- రామారెడ్డి: మండలంలోని ఆయా గ్రామాల పాఠశాలలో సోమవారం బాలల హక్కుల దినోత్సవాని నిర్వహించారు. విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు తప్పకుండా విద్యను అభ్యసించాలని, విద్యార్థులు తమ హక్కులను వినియోగించుకోవాలని సూచించారు. హక్కులపై విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరేందర్, సిఆర్పి మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.