బాలల హక్కులను పరిరక్షించాల్సిన భాద్యత ప్రతీ ఒక్కరిపై ఉందని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ మెంబర్ ఐ.నిర్మల అన్నారు మండలంలోని పత్తిపాక ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో బుధవారం రోజు ఏర్పాటు చేసిన బాలల హక్కుల అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ నెంబర్ ఐ నిర్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ చిన్న పిల్లలను పనులకు పంపించకూడదని, బాల కార్మిక వ్యవస్థని ఎవరుకూడా ప్రోత్సాహించకూడ దని నేటి పిల్లలే రేపటి పౌరులు కాబట్టి బడి వయసు పిల్లలు ప్రతి ఒక్కరిని విధిగా పాఠశాలల్లో చేర్పించి దేశ భవిష్యత్తుకై పాటు పడాలని కోరారు. ఈ సందర్బంగా బాలల హక్కుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.బాల్యవివాహాలు ప్రోత్సాహించవద్దని, పిల్లల హక్కుల పరిరక్షణ కోసం ఎలాంటి సమస్యలు ఎదురైనా 1098 నంబర్ కు ఫోన్ చేసి తమ సహకారన్ని పొందవచ్చని సూచించారు. ఫోక్సో చట్టం గురించి ఈ సందర్బంగా తెలియజేసారు తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైనా ఉంటే తమకు సమాచారం అందిస్తే వారికి రెసిడెన్షియల్ విద్యను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉన్నత, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయు లు కే.పి.నరేందర్ రావు, నూతి మల్లయ్య ఉపాధ్యాయులు విద్యార్థులు బాల బాలికలు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.