పట్టణంలోని మామిడిపల్లి భారతి నృత్య నికేతన్ విద్యార్థినులు ప్రతిభ కనపరచినట్టు నాట్య గురువు సరోజ సుధీర్ మంగళవారం తెలిపారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించినటువంటి 2023 – 24 సంవత్సరానికి సంబంధించి శ్రీ జ్ఞాన సరస్వతి సంగీత నృత్య పాఠశాల నిర్వహించిన పరీక్షలలో సర్టిఫికెట్ సాధించినట్టు తెలిపారు. ఈ సంవత్సరం వార్షిక పరీక్షలో భారతీనృత్యానికేతన్ విద్యార్థులు కూచిపూడి సర్టిఫికెట్ విభాగంలో సుస్వర ఫస్ట్ క్లాస్ లో నక్షత్ర సెకండ్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించిన సుస్వర, నక్షత్రలు నృత్యం నేర్చుకోవడంతోపాటు అందులోని మర్మాన్ని తెలుసుకుంటూ విజ్ఞానాన్ని, నృత్య విజ్ఞానాన్ని కూడా పెంచినటువంటి తల్లితండ్రులకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ప్రతి తల్లిదండ్రులు కూడా డాన్స్ నేర్పడే కాదు నృత్య విద్యలో వాళ్ళకి అనువైనటువంటి సర్టిఫికెట్లను అనుభవమైన విశ్వవిద్యాలయాల్లో మాత్రమే వాళ్ళ ప్రతిభను కనబరిచే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు.